ఎస్ .. అవును ఇండస్ట్రీలో ఎవరిని అడిగిన హ్యాండ్ సమ్ స్టార్ ఎవరు అంటే టక్కున చెప్పేది మహేష్ బాబు.  మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడు అనేది అందరికి తెలుసు. ఎంత అందంగా ఉంటాడో అంతే చక్కగా నటిస్తాడు.  ఆయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే . మరీ ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు . ఆయన సపరేట్ డైట్ ఫాలో అవుతాడు . ప్రస్తుతం మహేష్ బాబుకి 49 సంవత్సరాలు . అంటే దాదాపు 50 కి చెరువులో ఉన్నట్టే . అయినా సరే మహేష్ బాబు చూడడానికి 20 - 25 వయసుగల కుర్రాడిలా కనిపిస్తూ ఉంటారు .


కాగా మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని అందరూ మాట్లాడుతూ ఉంటారు . కానీ మహేష్ బాబు కాదు మహేష్ బాబు కన్నా ఇండస్ట్రీలో అందగాడు అమ్మాయిల కలల రాకుమారుడు ఒకడున్నాడు.  అతడే అక్కినేని అఖిల్ . చూడడానికి చాలా క్యూట్ గా.. చక్కగా.. ముద్దుగా ఉంటాడు అని అభిమానులంతా పిలుచుకుంటూ ఉంటారు . ప్రజెంట్ లెనిన్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. నిజానికి ఈ సినిమాలో శ్రీలీల ని హీరోయిన్ గా ఆనుకున్నారు కానీ ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంది అంటూ తెలుస్తుంది. ఆమె స్ధానం లోకి యంగ్ బ్యూటీ "భాగ్య శ్రీ బోర్సే" వచ్చిన్నట్లు తెలుస్తుంది.



ఈ సినిమాతో మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అఖిల్ అక్కినేని. రీసెంట్ గానే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అఖిల్ అక్కినేని .. త్వరలోనే ఓ బిగ్ పాన్ ఇండియా  సినిమాలో కూడా భాగం కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి మూమెంట్లోనే మహేష్ బాబు కన్నా ఇండస్ట్రిలో  అందగాడు అఖిల్ అంటూ జనాలు పొగిడేస్తున్నారు. చాలామంది అమ్మాయిలు అఖిల్ అంటే ఇష్టపడుతుంటారు.  అఖిల్  మాట్లాడే విధానం అందరికీ నచ్చేస్తూ ఉంటుంది . పలువురు అమ్మాయిలు సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి సంబంధించి ఏ విధంగా పొగిడేస్తుంటారో మనం చూస్తూనే ఉంటాం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: