మనకు తెలిసిందే.. రాంచరణ్ చాలా చాలా సైలెంట్ పర్సన్. ఎంత సైలెంట్ అంటే ఫ్రెండ్స్ ముందు ఏమైనా మాట్లాడుతాడు  ఏమో కానీ పెద్దవాళ్ళ ముందు ఇంట్లోని కుటుంబ సభ్యుల ముందు చాలా రిజర్వ్డ్  గా ఉంటారు , ఈ విషయాన్ని చాలామంది పెద్దలు పలు ఇంటర్వ్యూలలో పలు ఈవెంట్స్ లో బయటపెట్టారు . మరి ముఖ్యంగా చిరంజీవి  - పవన్ కళ్యాణ్ - నాగబాబు ముందు చాలా సైలెంట్ గా ఉండే రామ్  చరణ్.. అల్లు అరవింద్ తో మాత్రం చాలా జోవియల్ గా ఉంటాడు . ప్రజెంట్ గ్లోబల్ స్ధాయి  ఇమేజ్ సంపాదించుకున్న రాంచరణ్ "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు.
 

సినిమా అయిపోగానే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్..లోకేష్ కనగరాజ్ .. సందీప్ రెడ్డి వంగా.. లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయబోతున్నారు. రామ్ చరణ్ లైనప్ చూస్తే మరో 10 ఏళ్ల వరకు ఆయన టాప్ హీరోగా కొనసాగడం ఖాయం అనేలా ఉంది . ఇలాంటి మూమెంట్లోనే రాంచరణ్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .



వీళ్లది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ . రామ్ చరణ్ కన్నా ఉపాసన పెద్దది . అయినా సరే మెగాస్టార్ వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని అంగీకరించి పెళ్లి చేశారు.  అయితే ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారో తెలుసా. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ఐ లవ్ యు చెప్పారు అనే విషయాలు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారాయి . కాగా  రాంచరణ్ ముందుగా ఉపాసనకు ఐ లవ్ యు..పెళ్లి చేసుకుందామని చెప్పారట . ఉపాసన టైం తీసుకుని చెప్తాను అంటూ రామ్ చరణ్ ప్రపోజల్ని కొన్నాళ్లపాటు హోల్డ్ లో పెట్టిందట . తన కుటుంబానికి తన కుటుంబ విధి విధానాలకు రాంచరణ్ సూట్ అవుతాడా..? రామ్ చరణ్ మనస్తత్వం తనకు సూట్ అవుతుందా ..? ఇన్ని విధాలుగా ఆలోచించి ఆ తర్వాత ఉపాసన - రాంచరణ్ లవ్ ని ఆక్సెప్ట్ చేసిందట.  కొన్నాళ్లపాటు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న వీళ్ళు.. ఆ తర్వాత ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు . అంతకుముందే వీళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ . ఆ కారణంగానే వీళ్ళ ప్రేమ కన్ఫామ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: