
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ,నిధి అగర్వాల్ హీరోయిన్గా ,దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా 'హరిహర వీరమల్లు '200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత 'ఏ ఎం రత్నం 'ఈ సినిమాను నిర్మించారు .పవన్ గత సినిమాలకు టికెట్ ధరల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ..కానీ ఇప్పుడు మాత్రం వీరమల్లు సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ లెక్కలు మారేలా కనిపిస్తున్నాయి . రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హరిహర వీరమల్లు సినిమాకి టికెట్ రేట్ల విషయంలో మంచి హైప్ వస్తుందని వినిపిస్తోంది .
దీని ప్రకారం ఏపీలో సింగల్ స్క్రీన్ గరిష్ట టిక్కెట్ రేటు 230 నుంచి మల్టీప్లెక్స్ కు 295 వరకు ఉంటుందని అంటున్నారు . తెలంగాణ లో సింగల్ స్క్రీన్ కి గరిష్టంగా 265 నుంచి మల్టీప్లెక్స్ కి 413 వరకు ఉంటుందని సమాచారం .. ఈ ధరలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి . దీని పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అధికారిక ప్రకటన రానుంది . ప్రస్తుతం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 24 న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది . పవన్ కళ్యాణ్ సరసన 'నిధి అగర్వాల్ 'హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటించారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు