"రామ్ చరణ్".. ఒక హీరో కాదు ..ఒక స్టార్ హీరో కాదు ..ఒక పెద్ద మనిషి కూడా కాదు.. ఒక మంచి మనసున్న వ్యక్తి.  ప్రజెంట్ ఇలానే మాట్లాడుకుంటున్నారు జనాలు.  మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ రాంచరణ్ ని పొగిడేస్తుంటారు.  కానీ కామన్ పీపుల్స్ కూడా రాంచరణ్ ని పొగిడేస్తున్నారు అంటే  దానికి మెయిన్ రీజన్ రాంచరణ్ చేసిన మంచి పని . సాధారణంగా ఏ హీరో అయిన సినిమా చేసేది ఎందుకు.. తన పాపులారిటీ పెరగడానికి. రెమ్యూనరేషన్ తీసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి . అయితే కొంతమంది హీరోలు మాత్రం డబ్బులు కన్నా ఇంపార్టెంట్ గా పేరు కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు .


కాగా ఇప్పుడు రామ్ చరణ్ చేసిన ఒక పని ఆయనకు బిగ్ పాజిటివ్ కామెంట్స్ తెచ్చి పెట్టేలా చేసింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రామ్ చరణ్ తాను చేస్తున్న "పెద్ది" సినిమాకి వచ్చిన రెమ్యూనిరేషన్ మొత్తం కూడా ఆ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళకి సమానంగా ఇచ్చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఈ సినిమా కోసం రాంచరణ్ తో పాటు అందరూ ఈక్వల్ గా కష్టపడుతున్న సందర్భాలు చూసి ఆయన ముచ్చటపడి ఈ నిర్ణయం తీసుకున్నారట . రామ్ చరణ్సినిమా కోసం రెమ్యూనరేషన్ తో పాటు పలు ఏరియాలో షేర్ కూడా తీసుకుంటున్నాడు అన్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.



అయితే రెమ్యూనరేషన్ గా ఆయన తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ఈ సినిమాకి వర్క్ చేసిన నటీనటులకి ఈక్వల్ గా షేర్ చేయాలి అంటూ బుచ్చిబాబుని రిక్వెస్ట్ చేశారట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దీంతోరామ్ చరణ్ పెద్ద మనసు అంటూ అందరూ పొగిడేస్తున్నారు . రామ్ చరణ్ లాంటి హీరోలు ఇండస్ట్రీలో ఉండాలి అని సినీ కార్మికుల బాధలను అర్థం చేసుకుంటున్నాడు అని  ప్రశంసితున్నారు. ఏమైనా మెగాస్టార్ చిరంజీవి కొడుకు కదా ఆ మంచి మనసు ఎక్కడికి పోతుంది అంటూ మెగా ఫ్యామిలీని లైక్ చేసే వాళ్లు మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: