ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ రేపు 11:17 నిమిషాలకు రివిల్ చేయబోతున్నారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఘట్టమనేని ఫ్యాన్స్ ఇది తెలుసుకొని ఫుల్ ఖుషి అయిపోతున్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఇండస్ట్రిలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట .


రేపు 11 : 17 నిమిషాలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టబోతున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో సినీ వర్గాలల్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ మూమెంట్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . మహేష్ బాబు తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు . అయితే మహేష్ బాబు వారసుడిగా ఆయన కొడుకు గౌతమ్ ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అంతా ఆశపడ్డారు . కానీ గౌతమ్ కి సినీ ఇండస్ట్రీ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు అన్న విషయం బయటపడ్డింది.  పైగా సితార ఘట్టమనేని మొదటి నుంచి ఇండస్ట్రీలో బాగా మింగిల్ అవుతూ వచ్చింది .



సోషల్ మీడియాలో ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దానికి తగ్గట్టే నమ్రత.. మహేష్ బాబు ..సితార ఘట్టమనేని  ఎక్కడికి వెళ్తున్న తమ తోటి తీసుకెళ్లే విధానం చూసి అందరూ కూడా ఇక నెక్స్ట్ ఇండస్ట్రీలో ఘట్టమనేని వరసురాలిగా  సితార రంగంలోకి దిగినట్టే అంటూ మాట్లాడుకున్నారు . ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తలు కూడా అదే విధంగా ఉన్నాయి . ఇవన్నీ చూసుకుంటే సితార ఘట్టమనేని హీరోయిన్గా ఎంట్రీ ఫిక్స్ చేసేసినట్లే అంటున్నారు అభిమానులు .చూద్దాం రేపు 11:17 నిమిషాలకు ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పబోతుందో ఘట్టమనేని ఫ్యామిలీ..!?

మరింత సమాచారం తెలుసుకోండి: