తెలుగు ఫిలిం చాంబర్ చేసిన ప్రకటన ఇప్పుడు నిర్మాతల గుండెల్లో రల్లు పరిగెత్తేలా చేస్తుంది. మనందరికీ తెలిసిందే సినీ కార్మికుల వేతనాలు పెంచాలి అంటూ సమ్మె నిర్వహిస్తున్నారు సినీ కార్మికులు. నిర్మాతలు వేతనాలు 30% పెంచి ఇవ్వాలి అని.. అలా అయితేనే సమ్మె విరమించుకుంటామని ..పట్టుబట్టి భీష్ముంచుకుని కూర్చున్నారు . ఎన్ని కాంప్రమైజ్ లు చేస్తున్న అస్సలు మాట వినడం లేదు . ఈ పంచాయతీ ఇంకా ఏ కొలిక్కి రానే రాలేదు . అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది.


 నిర్మాతలను భయపెడుతూనే స్ట్రెయిట్ గా ఆదేశాలు జారీ చేస్తూ హెచ్చరిక చేసింది. " స్టూడియోలు, అవుట్ డోర్ యూనిట్లు.. మౌలిక వసతుల యూనిట్ సభ్యులు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ముందుగా ఇస్తున్న సమాచారం ఇది ..స్పష్టమైన అనుమతి లేకుండా ఎటువంటి పెద్ద వ్యక్తుల అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా.. ఎలాంటి సేవలను అందించకూడదు ..నిర్మాతలు ఈ ఆదేశాలు సీరియస్ గా తీసుకోవాలి. దీన్నంతటికి కారణం తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చిన సినీ పెద్దలు సరిగ్గా పట్టించుకోవడం లేదూ".



"ఎవరైతే ఈ నిబంధనను ఉల్లంఘిస్తారో.పెడచెవిన పెడతారో ..వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం " అంటూ స్ప్రైట్ గా వార్నింగ్ ఇచ్చింది . తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఈ ఇది అమల్లోనే ఉంటాయి అంటూ తెలిపారు . తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయంతో దర్శక నిర్మాతలకు కొత్త టెన్షన్ మొదలైంది . నిర్మాతలు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ..? అనేది బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది బిగ్ స్టార్స్ హీరోల సినిమాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి . ఈ సినిమాల షూటింగ్ ఆగిపోతే ఒకటి రెండు కాదు కోట్లలోనే నష్టం వాటిల్లుతుంది . ఇప్పుడు నిర్మాతల పరిస్థితి "ముందు చూస్తే నుయ్యి  వెనుక చూస్తే గొయ్యి" అన్నలా తయారైంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: