తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్ లో ఉంది అంటే దానికి ప్రధాన కారకుడు సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. అలాంటి ఆయన కేవలం సినిమా ఇండస్ట్రీ కే కాకుండా రాజకీయాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ కొనసాగించారు. టిడిపి పార్టీని స్థాపించి సంవత్సరంలోనే అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన నట వారసులుగా ఇండస్ట్రీలోకి తన కొడుకులు మనవళ్ళు అందరూ ప్రస్తుతం కొనసాగుతున్నారు. కేవలం బాలకృష్ణ మాత్రమే రాజకీయాల్లో సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఇదిలా కొనసాగుతున్న తరుణంలో  ఫ్యూచర్లో టిడిపి పార్టీని కాపాడేది  జూనియర్ ఎన్టీఆర్ అంటూ అప్పుడప్పుడు కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఈ విషయంలో టిడిపి శ్రేణులకు మరియు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఒక్కోసారి వార్ జరుగుతూనే ఉంటుంది. 

కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి రావడం గురించి ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన సినిమాలు తాను చూసుకుంటూ తన జీవితాన్ని తాను గడుపుతున్నారు. కానీ నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ను హింసిస్తూనే ఉంది. అయినా ఎన్టీఆర్ పడి లేచిన కెరటంలా దూసుకెళ్తూనే ఉన్నారు.. కట్ చేస్తే ఎన్టీఆర్ అభిమానులకు టిడిపి శ్రేణులకు మరోసారి ట్విట్టర్ వేదికగా ఒక రణరంగం మొదలైంది. అది ఏంటయ్యా అంటే ..తాజాగా రజినీకాంత్  హీరోగా కూలీ సినిమా రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు.. సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్ కు ప్రత్యేకమైన శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. 

మా కుటుంబాన్ని అత్యంత కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తివి నీవు, మిమ్మల్ని ఎప్పుడూ మరువము..మీ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కూలీ చిత్రానికి  విషెస్ చెప్పిన లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాకి మాత్రం ఎందుకు విషెస్ చెప్పడం లేదని  ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. గతంలో టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్టీఆర్ ఊరురా తిరుగుతూ ప్రచారం చేశారని, ఆయన మేలు మీరు మర్చిపోయారని నెట్టింట్లో లోకేష్ ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. మరి ఈ చర్చ ఎక్కడికి దారితీస్తుందో ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: