తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన యువ నటి మనులలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సవ్యసాచి అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ లో ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకి ఒక మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. దానితో ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. తాజాగా ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ భారీ అంచనాల నడుమ జూలై 24 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా ద్వారా ఈమెకు భారీ విజయం దక్కి అవకాశాలు ప్రస్తుతానికి మాత్రం కనబడడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి. తాజాగా ఈ బ్యూటీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వాహనంలో ఓ సందర్భంలో ప్రయాణించింది. దానిపై అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఇలా ఇది పెద్ద వార్త కావడంతో తాజాగా నీది అగర్వాల్ స్పయంగా ఈ విషయంపై స్పందించింది.

తాజాగా నిధి అగర్వాల్ ఈ వార్త గురించి స్పందిస్తూ ... భీమవరం లో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఇదంతా జరిగింది. స్థానిక నిర్వహణకులు నా కోసం ఒక కారు ను ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ వాహనం అని నాకు అస్సలు తెలియనే తెలియదు. అందులో నా ప్రమేయం ఏ మాత్రం లేదు. ప్రభుత్వమే నాకు స్వయంగా ఈ వాహన సదుపాయాన్ని కల్పించింది అని కొంత మంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇవన్నీ తప్పు. అభిమానులు అస్సలు దానిని నమ్మద్దు అని నిధి అగర్వాల్ స్వయంగా చెప్పుతూ ఒక ప్రకటనను తాజాగా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: