
అలాగే అభిమానుల మదిలో ఎంతో కాలం పాటు ఈ సినిమా గుర్తుండిపోతుందని తన రివ్యూ ని తెలియజేసింది లత. ఈ చిత్రానికి సంబంధించి విజువల్స్, కథ, రజినీకాంత్ నటన అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపింది. అలాగే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయిన ఉదయనిది స్టాలిన్ కూడా కూలీ సినిమా పైన తన రివ్యూ ని పంచుకోవడం జరిగింది. కూలీ సినిమా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అని ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఇప్పటికే ఓవర్సీస్ లో కూడా అడ్వాన్సుతో సరికొత్త రికార్డులను సృష్టించిన కూలి చిత్రం.. దేశవ్యాప్తంగా రూ.53 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు వినిపిస్తున్నాయి. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 80 నుంచి 100 కోట్ల మార్కుని అందుకుంటుంది అంటూ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్, నాగార్జున, ఉపేంద్ర, పూజా హెగ్డే నటించారు. రజనీకాంత్ నటించిన గత చిత్రాలు వేట్టయన్ , లాల్ సలాం సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో నిరాశతో ఉన్న అభిమానులకు కూలీ సినిమా బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మొదటి రోజు ఎన్ని కోట్ల రూపాయలు రాబడుతుందో చూడాలి మరి.