బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ-2 . ఈ సినిమా పై అభిమానుల్లో ఆకాశాన్నంటిన అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ల కాంబో అంటేనే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అన్న ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.  2021లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో మరింత శక్తివంతంగా కనిపించనున్నారని మేకర్స్ ముందే స్పష్టం చేశారు. సం యుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన "ది తాండవం" సాంగ్‌కు వచ్చిన స్పందనతో టీమ్ ఉత్సాహంగా ఉంది. ఇదే వేగంలో తాజాగా మరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

వైజాగ్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘జాజికాయ… జాజికాయ…’ అంటూ సాగే ఈ ఎనర్జెటిక్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మూవీ మేకర్స్. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్  ఆకట్టుకోగా, బ్రిజేశ్ శాండిల్య – శ్రేయా ఘోషల్ జంటగా పాడిన ఈ పాటకు థమన్ భావోద్వేగాలు, బీట్‌ల మేళవింపుతో అద్భుతమైన సౌండ్ ఇచ్చాడు. ఈ సాంగ్‌లో బాలయ్య వేసిన నాటి స్టెప్స్, బోయపాటి స్టైల్ మాస్ బీట్‌లు అభిమానులను థియేటర్లలో ఊగించనున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సాంగ్ తో సినిమా పై మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు.  

ఇటీవలే మేకర్స్ మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు. ఈ సినిమాను 2Dతో పాటు 3D వెర్షన్‌లో కూడా విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రేక్షకులకు సరికొత్త, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొత్తం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 5న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. బాలయ్యబోయపాటి కాంబో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధంగా ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: