గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఆయన తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ వారణాసిపై నెలకొన్న నెగిటివ్ ట్రెండ్స్‌ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా, టైటిల్ గ్లింప్స్ ప్రదర్శించిన సమయంలో వచ్చిన చిన్న గ్లిచ్‌లను కొన్ని సోషల్ మీడియా పేజీలు పెద్దగా చూపించడంతో, రాజమౌళి మీద మీమ్స్‌–ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ఈ విషయం అభిమానుల్లో కూడా కొంత నిరాశను కలిగించింది.కానీ, రాజమౌళి శైలిని అందరికీ గుర్తు చేస్తూ… ఒక్క రోజులో పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీ మొత్తం పాజిటివిటీగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ మళ్లీ వారణాసి కోసం ఎక్జయిట్ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న స్థాయిని మించి, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొంటున్నాయి.


ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ వరల్డ్ సినిమా హీరోగా మహేశ్ బాబు నటిస్తుండగా, ఫీమేల్ లీడ్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా ఎంపికైన విషయం తెలిసిందే. మరో కీలక పాత్రలో మాలీవుడ్ సూపర్‌స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్‌లు ఇటీవల పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక ఇంటర్వ్యూ అనంతరం ముగ్గురూ కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. వారి స్టార్ పవర్, కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ ఉత్సాహంతో నిండిపోయారు. సినిమాలో ప్రియాంకా చోప్రా మందాకినిగా, మహేశ్ బాబు రుద్రగా, పృథ్విరాజ్‌ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. “ప్రపంచమంతా చుట్టే కథలోని ముఖ్య ముఖాలు ఇవే… ముగ్గురి కలయిక వేరే లెవెల్ హిట్‌కు దారితీస్తుంది” అనే క్యాప్షన్‌తో మహేశ్ బాబు టీమ్‌ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



అంతేకాక, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మహేశ్ బాబు త్రిశూలం పట్టుకుని నంది మీద స్వారీ చేస్తూ కనిపించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌తో, మైథలజికల్ టచ్‌తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదల కానుందని సమాచారం. 7 ఏప్రిల్ 2027 లో  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీమ్‌ ఆలోచనలో ఉందని టాక్ వినిపిస్తుంది.  మొత్తం మీద, వచ్చిన చిన్న గ్లిచ్‌లు, నెగిటివ్ ట్రోల్‌లు—అన్ని ఒక్క ఇంటర్వ్యూతోనే తుడిచిపెట్టుకుపోయాయి. రాజమౌళి తన మ్యాజిక్‌తో మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే కాదు… ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు. ఇదే రాజమౌళి స్టైల్… ఇదే రా ఎక్స్‌పీరియన్స్ అంటే!అంటూ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: