సదరు అభిమాని వైపు తిరిగి..“ఎవ్వడ్రా వాడినికి ఇక్కడికి తీసుకొచ్చింది..? అసలు నిన్ను ఎవరు రావమ్మన్నారు?” అంటూ బాలయ్య కోపంతో ప్రశ్నించినట్టు వీడియోలో చూపిస్తోంది. అంతేకాకుండా అతని వైపు వేళ్లు చూపిస్తూ అసహనం వ్యక్తం చేయడం కూడా కనిపిస్తోంది. అక్కడితో ఆగకుండా, ఆ అభిమాని సాయంత్రం జరగనున్న ఈవెంట్‌లో కనిపించకూడదని తన సెక్యూరిటీ సిబ్బందికి బాలయ్య ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం వస్తోంది. ఈ ఘటన వల్ల ఆ అభిమాని ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు..ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “అభిమానులే హీరోను ఈ స్థాయికి తీసుకొస్తారు… వారితో ఇలాగే మాట్లాడాలా?” .. “ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరైనదా?”
అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కొంతమంది బాలయ్య ఆగ్రహ స్వభావంపై గతంలో జరిగిన ఘటనలను కూడా గుర్తు చేస్తూ, “ఇలాంటి వ్యవహారశైలి మారేలా కనిపించడం లేదు” అని కామెంట్ చేస్తున్నారు. ఈ చిన్న సంఘటననే కానీ, బాలకృష్ణ పేరు ఉన్నందున అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అఖండ–2 ప్రమోషన్స్ మధ్యలో ఈ అనుకోని వివాదం ఆయన టీమ్‌కి కూడా తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి