అయితే, ఆ ఘటనలో హేమ జైలుకెళ్లడం ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె తల్లికి తీవ్ర మానసిక వేదన కలిగించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని హేమ పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. తన అరెస్ట్ తర్వాత తల్లి తీవ్ర ఆందోళనకు గురై, అనారోగ్యంతో బాధపడిందని హేమ భావోద్వేగంతో చెప్పింది. ఇప్పుడేమో ఆ ఆందోళనలన్నింటికీ తెరపడినట్టుగా, హేమ తల్లి కోళ్ల లక్ష్మి ఇక లేరని తెలిసి సినీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో నివసిస్తున్న ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న హేమ వెంటనే స్వగ్రామానికి చేరుకున్నారు.
తల్లి మృతదేహాన్ని చూసిన హేమ భారంగా మానసికంగా కుదేలైపోయింది. కన్నీళ్లు ఆగకుండా విలపించిన ఆమె, “నిన్న ఉదయం వరకు అమ్మతో మాట్లాడాను. ఆమె బాగానే ఉంది… ఇంతలోనే ఇలా పెద్ద దుస్థితి వచ్చి పడుతుందని ఊహించలేదు” అంటూ ఏడ్చేసిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.తల్లి మరణంతో హేమ తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను ఓదారుస్తున్నారు. హేమ కి మొదటి నుండి తన తల్లి అంటే బాగా ఇష్టం. బాగా గారాభంగా కూడా పెరిగింది. ఎంతో కష్ట పడి పెంచిన తల్లి ఇక లేదు అని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది హేమ. ఆమె మృతికి ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నారు ప్రముఖులు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి