వార్ 2 సినిమా, ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రంగా హృతిక్ రోషన్ కలిసి నటించిన ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్, ఆగస్టు 14, 2025న విడుదలైంది. ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రేక్షకులు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లు, హృతిక్ రోషన్ స్టైలిష్ నటన, కియారా అద్వానీ యాక్షన్ రోల్ ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా, ఇద్దరు హీరోల మధ్య డ్యాన్స్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చాలామంది పేర్కొన్నారు. అమెరికాలో ఎన్టీఆర్ ఎంట్రీకి విజిల్స్, సంబరాలు జరిగాయని కొందరు అభిమానులు షేర్ చేశారు.

సినిమాపై మిశ్రమ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్‌గా పేర్కొన్నా  సెకండ్ హాఫ్ కొంత నిరాశపరిచిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కథ రొటీన్ స్పై థ్రిల్లర్ టెంప్లేట్‌లో ఉందని, వీఎఫ్‌ఎక్స్‌లో లోపాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కొందరు సినిమా యావరేజ్‌గా ఉందని, ఎమోషనల్ డెప్త్ లోపించిందని పేర్కొన్నారు . ఉదాహరణకు, ఒక యూజర్ సినిమాను "మీడియోకర్ యాక్షన్ థ్రిల్లర్"గా అభివర్ణించాడు, స్టైల్ కంటే కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు.

హీరోల నటనపై ప్రశంసలుఎన్టీఆర్, హృతిక్ నటనపై మాత్రం అందరూ ఏకగ్రీవంగా ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ తన తీవ్రమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఫస్ట్ హాఫ్‌ను డామినేట్ చేశాడని, హృతిక్ సెకండ్ హాఫ్‌లో అద్భుతమైన ట్విస్ట్‌తో మెప్పించాడని నెట్ రివ్యూలు చెబుతున్నాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్‌లు గూస్‌బంప్స్ తెప్పించాయని అభిమానులు రాశారు. కియారా అద్వానీ యాక్షన్ రోల్ కూడా ఆశ్చర్యపరిచిందని, అయితే ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత లేదని కొందరు విమర్శించారు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని సెన్సార్ రివ్యూలు కూడా సూచించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కారణంగా భారీ బుకింగ్స్ జరిగాయని, అయితే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: