
ప్రస్తుతం అతను ప్రతిభావంతుడైన దర్శకుడు కార్తీక్ వర్మ దండు డైరెక్షన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరొకసారి 100 కోట్ల మార్క్ దాటాలని, పెద్ద సక్సెస్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై పి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన కెరీర్, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
"ప్రస్తుతం నేను లవ్ స్టోరీలు చేయాలని అనుకోవడం లేదు. ప్రేక్షకుల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ లవ్ స్టోరీలకు ఇప్పుడు అంతగా డిమాండ్ లేదు. వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ సినిమాలు, కొత్త కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే నేనూ అలాంటి స్క్రిప్ట్‌లు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే శోభిత లాంటి జెన్యూన్ సలహాలు తన కెరీర్‌లో ఎంతో సహాయపడుతున్నాయని నాగచైతన్య చెప్పుకొచ్చారు. శోభిత చాలా నిజాయితీగా ఉంటుంది. సినిమా బాగుంటే బాగుంది అని చెప్తుంది, బాగోలేదంటే ముఖాన్నే బాగోలేదు అని చెప్పేస్తుంది. అలాంటి నిజాయితీ సలహాలు విన్నప్పుడు మరింత కష్టపడి కొత్త పాత్రలు చేయాలనే ప్రేరణ కలుగుతుంది. శోభిత సోషల్ మీడియా ట్రెండ్స్‌పై ఎప్పుడూ అప్డేట్‌గా ఉంటుంది, జనాల అభిరుచులు బాగా అర్థం చేసుకుంటుంది. అందుకే సినిమాల విషయంలో కూడా నేను మార్పులు చేసుకోవాలని సలహా ఇస్తుంది. ఆమె సలహాలు నా కెరీర్‌కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి"అని చెప్పారు నాగచైతన్య.
ఈ ఇంటర్వ్యూలో నాగచైతన్య చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత జెన్యూన్, ఎంత అర్థమయ్యే విధంగా ఉందో అని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. "నాగచైతన్య నిజంగా చాలా అదృష్టవంతుడు. అలాంటి మంచి అమ్మాయి తన జీవితంలోకి రావడం లక్కీ అని చెప్పాలి" అని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం నాగచైతన్య మాటలపై కౌంటర్లు కూడా వేస్తున్నారు. "రాజు గారి చిన్న భార్య మంచిది అంటే, పెద్ద భార్య చెడ్డదేనా?" అంటూ పాత సామెతలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో వివిధ రకాల మీమ్స్ చేస్తున్నారు. అయినప్పటికీ, నాగచైతన్య – శోభితల అనుబంధం గురించి అందరూ మాట్లాడుకుంటూ, వారి జంటను ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు.