రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందుతున్న ‘పెద్ది’ షూటింగ్ దాదాపు 50 దాపు శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ  మధ్యనే ఈసినిమాకు సంబంధించి మైసూర్ లో టైటిల్ సాంగ్ షూట్ ని వందలాది జూనియర్ ఆర్టిస్టులతో పూర్తి చేశారు. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ దర్శకుడు బుచ్చిబాబు ఈమూవీకి  సంబంధించిన కొన్ని షాట్స్ అనుకున్న స్థాయిలో రాకపోవమడంతో  మళ్ళీ మళ్ళీ రీ షూట్ అని అంటునట్లు లీకులు వస్తున్నాయి.  


ఈవిషయంలో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్ చరణ్ సహకారం ఉండటంతో ఈమూవీకి సంబంధించి బెస్ట్ అవుట్ ఫుట్ వస్తోందని ఇన్ సైడ్ టాక్. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్న పెద్ది కెమెరామెన్ రత్నవేలు ఒక మీడియా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయాలకు సంబంధించిన లీకులు ఇచ్చాడు.  


ఈసినిమాకు సంబంధించి రామ్ చరణ్ తన స్టైల్ యాక్షన్ డిక్షన్ తో ‘పెద్ది’ కి సరికొత్త రూపం తెస్తున్నట్లు చెపుతూ రత్నవేలు ఈమూవీ  రంగస్థలంని మించిన స్థాయిలో ఉంటుందని  రత్నవేలు అంటున్నాడు.    ఈమూవీ కధ సాధారణమైన విలేజ్ డ్రామా లా ఉండదని రంగస్థలంకు పదింతలు అవుట్ ఫుట్ ని ‘పెద్ది’ నుంచి ఆశించవచ్చు అని రత్నవేలు  ఇచ్చిన లీకులు  చరణ్ అభిమానులలో జోష్ ను పెంచుతున్నాయి.  


ఇది ఇలా ఉండగా వచ్చే సంవత్సరం ‘ఉగాది’ ది పండుగ సంధర్భంగా మార్చి 27న విడుదలకాబోతున్న ‘పెద్ది’ కోసం పలు అంతర్జాతీయ సంస్థలు కొలాబరేట్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.   ఈ వార్తలే నిజం అయితే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ లేని ఒక ఎమోషనల్ డ్రామాకు ఇలాంటి పాన్ ఇండియా టై అప్ జరగడం ఒక రికార్డు అవుతుంది.  


పవన్ కళ్యాణ్ ‘ఓజి’ హడావిడి పూర్తి అయ్యాక దసరా పండగ సందర్భంగా ‘పెద్ది’ నుంచి మొదటి లిరికల్ సాంగ్ విడుదల అయ్యే  అవకాశం ఉంది  అంటున్నారు. ఈసినిమా క్రియేట్ చేయబోయే రికార్డు ల పై ఇప్పటి నుంచే  అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి..  




మరింత సమాచారం తెలుసుకోండి: