సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కన్నడ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్మూవీ కి కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఏకంగా 120 దేశాలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. మహేష్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం , ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ స్టార్ బ్యూటీ మహేష్ బాబు సార్ ను నేను అన్న అని పిలిచే దానిని అని , ఆయన నాకు చాక్లెట్స్ కూడా ఇచ్చేవారు అని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు , తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించిన శ్రీ విద్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 

ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన కూడా ఈమెకు తమిళ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇక mపోతే శ్రీ విద్య కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరో గా రూపొందిన యువరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఈమెను ఎత్తుకొని ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో గురించి శ్రీ విద్య మాట్లాడుతూ ... నేను మహేష్ సార్ హీరోగా రూపొందిన యువరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. ఆ సమయంలో నేను మహేష్ గారిని అన్నా అని పిలిచే దానిని. ఆయన నాకు చాక్లెట్స్ కూడా ఇచ్చేవారు అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: