మన తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఇకపోతే ప్రస్తుతం మన తెలుగు హీరోలలో అత్యవసరంగా హిట్టు దక్కవలసిన అవసరం ఉన్న హీరోలలో కూడా రవితేజ ఒకరు. రవితేజ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. ఆఖరిగా రవితేజ , త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా అనే సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు.

ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ రవితేజ కెరియర్ లో 76 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో RT 76 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ ను మేకర్స్ ప్రారంభించారు.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమా స్టార్ట్ కావడం తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులు ఇప్పటికే భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను భారీ ధరకు జీ 5 ఓ టి టి సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt