జాన్వి కపూర్ అనే పేరు ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. తల్లి శ్రీదేవి గారి వారసురాలిగా బరిలోకి దిగిన జాన్వి, అందం, టాలెంట్ రెండూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తన కెరీర్‌లో పెద్ద హిట్‌ను అందుకోలేకపోయింది. అయినప్పటికీ, ఆమెకు ఉన్న అభిమానుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గ్లామర్, స్టైల్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వంటివి ఆమెను ఈ తరం యువతలో క్రేజ్‌గల హీరోయిన్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల మధ్య కూడా జాన్వి బాగా గుర్తింపు తెచ్చుకుంది.


తెలుగు ఇండస్ట్రీలో దేవర సినిమా ద్వారా తన అందం, అభినయం చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వి, ఆ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఒక సెన్సేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో జాన్వి అంచనాలు కొంతమేర తగ్గిపోయాయి. అయినప్పటికీ, ఆమె ఆశలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తున్న చిత్రంపై తన భవిష్యత్తు ఆశలుపెట్టుకుంది. ఆ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో పక్కా స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది.



ఇలాంటి సమయంలో జాన్వి కపూర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ జాన్విని సరదాగా ప్రశ్నిస్తూ.."మీరు ఎవరితో ముద్దు సీన్స్ చేయాలనుకుంటారు?” అని. దానికి జాన్వి ఓపెన్‌గా, ఏ మాత్రం సంకోచం లేకుండా సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా “తెలుగు హీరోలలో ఎవరితో ముద్దు  సన్నివేశాలల్లో నటించాలనుకుంటారు?” అని అడిగితే ఆమె రెండు పేర్లు చెప్పింది—విజయ్ దేవరకొండ మరియు మహేష్ బాబు. విజయ్ దేవరకొండ పేరు చెప్పడం అందరికీ ఓకే అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంకా పెళ్లి కాని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. కానీ మహేష్ బాబు పేరు చెప్పడం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటికే పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన సూపర్‌స్టార్. అలాంటి హీరోతో లిప్‌లాక్ సీన్స్ చేయాలనుకోవడం ఓ షాకింగ్ స్టేట్‌మెంట్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.



అయితే జాన్వి అభిమానులు ఆమెను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు: “జాన్వి లిప్‌లాక్ సీన్స్ ఖచ్చితంగా చేస్తానని అనలేదు. ఒకవేళ అవకాశం వస్తే అలాంటి సీన్స్ మహేష్ బాబుతో చేయాలనుకుంటున్నానని మాత్రమే చెప్పింది. అది కేవలం ఒక ఫన్ ర్యాపిడ్-ఫైర్ సమాధానం మాత్రమే” అని క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనా జాన్వి కపూర్ చాలా చిలిపి, సరదాగా ఉండే అమ్మాయి అనేది ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. ఆమె సరదా మాటలు, నాటి జవాబులు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఆమె అల్లరి నడవడికలపై ఫ్యాన్స్ ముద్దుగా కామెంట్స్ చేస్తున్నారు. “జాన్వి నిజంగా అలరించే అమ్మాయి, చాలా క్యూట్” అంటూ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్‌లోని ప్రతి సినిమా, ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. రామ్ చరణ్ సినిమా విజయవంతమైతే జాన్వి కపూర్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలబడటం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: