
కల్కి సీక్వెల్ నుంచి దీపికను తప్పించడం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒకింత షాకిచ్చింది. మొదట స్పిరిట్ నుంచి దీపికా పదుకొనేను తప్పించగా కల్కి మేకర్స్ సైతం అదే దారిలో నడిచారు. అయితే దీపిక విధించిన షరతుల వల్లే ఈ విధంగా జరిగిందని తెలుస్తోంది. దీపిక గొంతెమ్మ కోర్కెలను తాము తీర్చలేమని చెబుతూ మేకర్స్ చేతులెత్తేశారని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో దీపికా పదుకొనేకు వరుస షాకులు తగులుతున్నాయి.
దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 25 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో అడిగారని తనతో పాటు 25 మంది సిబ్బంది ఉంటారని ఆమె చెప్పారని సమాచారం అందుతోంది. దీపికా పాడుకొనే డిమాండ్లు నెరవేర్చాలంటే ఆమె కోసమే ఏకంగా 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీపికా పదుకొనే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ 800 నుంచి 900 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా 2027 సంవత్సరంలో విడుదల కానుంది. ఈ సినిమా మాత్రమే దీపికా పదుకొనే కెరీర్ ను డిసైడ్ చేయనుంది. దీపికా పదుకొనే తప్పుకున్న నేపథ్యంలో కల్కి మేకర్స్ ఏ విధంగా ముందుకెళ్తారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
కల్కి సీక్వెల్ ఇతర భాషల్లో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. కల్కి సీక్వెల్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. నాగ్ అశ్విన్ తక్కువ సినిమాలనే తెరకెక్కిస్తున్నా హై క్వాలిటీతో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కల్కి సీక్వెల్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కల్కి సీక్వెల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని సమాచారం.