నయనతార ఏ సినిమాలో చేసినా సరే నిర్మాతలకు ముందే కండిషన్లు పెడుతుంది అనే రూమర్ ఉండనే ఉంది. నయనతార చేసే సినిమాలో ఎంత పెద్ద హీరో అయినా ఉండనీ కానీ ప్రమోషన్స్ కి మాత్రం అస్సలు రాదు.అయితే ఈ విషయాన్ని ముందుగానే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. నేను ప్రమోషన్స్ చేయనని ముందే చెబుతుంది.ఇక ప్రమోషన్స్ కి రాదు కానీ రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ కూడా నయనతార అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే అలాంటి నయనతార అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. 

ఈ సినిమాకి మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల అలాగే సాహు గారపాటి లు నిర్మాతలుగా చేస్తున్నారు. అయితే తాజాగా నయనతార కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్లు నయనతార మన శంకర వరప్రసాద్ గారు సినిమా నిర్మాతలకి గట్టిగానే చుక్కలు చూపిస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క వీడియోతో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ వీడియోలో ఏముందంటే..తాజాగా నయనతార చిరంజీవితో కలిసి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. 

అలా హైదరాబాద్ కి వచ్చిన సమయంలో నయనతారతో పాటు ఆమె ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఇద్దరు కేర్ టేకర్లు,నాలుగు అసిస్టెంట్లు ఇలా ఓ పెద్ద గ్యాంగ్ దిగింది. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు నయనతార తో వచ్చే గ్యాంగ్ మొత్తాన్ని మెయింటైన్ చేసేది నిర్మాతనే. ఈ లెక్కన నిర్మాత నయనతార కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్టు అర్థం అవుతుంది. అయితే నిర్మాతకు భారం ఎక్కువైనప్పటికీ ముందే నిర్మాతలతో నయనతార ఒప్పందం కుదిర్చుకుంది. కాబట్టి ప్రతి విషయానికి తలొగ్గాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ నయనతార వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: