తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'మిరాయ్' సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 'హనుమాన్' తర్వాత తేజ సజ్జా మరోసారి సూపర్ హీరో పాత్రతో అభిమానులను మెప్పించాడు.

మిరాయ్' సినిమా కథ క్రీ.పూ. 250లో జరిగిన కళింగ యుద్ధం తర్వాత చక్రవర్తి అశోకుడు రాసిన తొమ్మిది పురాతన గ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రంథాలకు అసాధారణ శక్తులుంటాయి. ఈ గ్రంథాలను చెడు శక్తుల నుంచి కాపాడటానికి తరతరాలుగా కొందరు రక్షకులు ఉంటారు. కథ ప్రకారం, ఆధునిక కాలంలో క్షుద్ర మాంత్రికుడైన మహావీర్ (మంచు మనోజ్) ఆ గ్రంథాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి,  వేద (తేజ సజ్జా), తన తల్లి ఆశయాన్ని నెరవేర్చడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి 'మిరాయ్' అనే దివ్య దండాన్ని అస్త్రంగా చేసుకుని యోధుడిగా మారతాడు.

సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం, సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే, ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. ఈ భారీ డీల్స్ ద్వారా సినిమా బడ్జెట్‌లో మూడు వంతుల వరకు రికవరీ అయిందని సమాచారం.

సినిమా ప్రారంభంలో రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మిరాయ్  మూవీ కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో రికార్డులు చేస్తుందో చూడాల్సి ఉంది. మిరాయ్  సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం.  మిరాయ్ సినిమా ఫస్ట్  డే  కలెక్షన్లు పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: