టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ఘాటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ట్రైలర్లో యాక్షన్ సన్నీవేషాలు అద్భుతంగా చూపించడంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి సినిమాల లాగా ఉంటుందని అంచనా వేశారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.ఈ చిత్రంలో అనుష్కతో పాటుగా మరొక నటుడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించారు. కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేదని టాక్ వినిపిస్తోంది. ఘాటి సినిమా యావరేజ్ గానే నిలిచింది.


ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన వారం తర్వాత తాజాగా హీరోయిన్ అనుష్క సోషల్ మీడియాలో (ఫేస్ బుక్) లో ఒక ఎమోషనల్ నోట్ రాసుకు వస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది..."నీలి వెలుగును దీప కాంతిగా.. మార్చుకుంటూ సరైన జీవితాన్ని గుర్తు చేసుకొని ప్రపంచంతో మళ్లీ కలిసిపోవడానికి కొంతకాలం పాటు సోషల్ మీడియాకి  దూరంగా ఉండబోతున్నానని తెలిపింది"..అలాగే త్వరలోనే మరిన్ని కథలతో , మరింత ప్రేమతో మిమ్మల్ని కలిసేందుకు మీ ముందుకు వస్తానంటూ అనుష్క రాసుకొచ్చిన ఒక ఎమోషనల్ నోట్ వైరల్ గా మారుతోంది.


మొత్తానికి అనుష్క శెట్టి రాసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మలయాళం సినిమా ఆయన కథనర్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో కూడా అనుష్క చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ ఒక్క సినిమా తప్ప మరే సినిమాలో కూడా అనుష్క నటించలేదు.. గత కొంతకాలంగా అనుష్క వివాహ విషయం లో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వచ్చే ఏడాదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: