సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త ఎవరో ఒకరి నోటి నుండి బయట పడుతూనే ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని ప్రతి ఒక్క హీరోయిన్ అంటుంది.అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఢీ డాన్సర్ అయినటువంటి నైనిక ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో వల్గర్ పనులు పెరిగిపోయాయి. అందరూ గలీజ్ గా తయారయ్యారంటూ ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి. మరి ఇంతకీ నైనిక ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది ఓపెన్ గానే కమిట్మెంట్స్ అడుగుతున్నారు.అలా నాకు కూడా చాలా సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి కమిట్మెంట్ అడిగారు. కానీ నేను వాళ్ళ కమిట్మెంట్లకు ఒప్పుకోకపోయేసరికి మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేయలేదు. 

అలాగే నాకు తెలిసిన ఓ వ్యక్తి ఫోన్ చేసి ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం పర్సనల్ రిక్వైర్మెంట్ అన్నాడు. దాంతో తెలిసిన వ్యక్తి కదా అని ఓకే చెప్పాను. ఆ తర్వాత మళ్లీ ఆ వ్యక్తి పర్సనల్ రిక్వైర్మెంట్ అని నొక్కి చెప్పడంతో అసలు మ్యాటర్ అప్పుడు అర్థం చేసుకున్నాను.అంతేకాదు ఆయన నీ ఫోటోతో పాటు నీ రేటు కూడా బయటకు వెళ్ళింది వైరల్ అయింది అని చెప్పడంతో షాక్ అయిపోయాను.. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిల వల్లే ఇలాంటి కల్చర్ ఎక్కువగా పెరిగిపోతుంది.అవకాశాల కోసం వాళ్లు కమిట్మెంట్లు ఇస్తారు.కానీ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళే అనుకొని కమిట్మెంట్లు అడుగుతారు. కానీ అందరూ అలా ఉండరు కదా.ఇక సినిమాల్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తారనుకుంటారు.

కానీ టాలెంట్ ఉంటే ఎలాగైనా ఆఫర్స్ వస్తాయి. నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ నాకు కూతురు పుడితే ఇండస్ట్రీకి కచ్చితంగా రానివ్వను. సినీ ఇండస్ట్రీ లోకి వస్తానంటే ఈ ఫీల్డ్ మంచిది కాదని ముందే చెబుతాను.. అంటూ ఓపెన్ గానే చెప్పేసింది నైనిక.అయితే నైనికని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది కమిట్మెంట్లు అడగడం వల్లే ఈ విషయాన్ని బయట పెట్టింది.ఇక ఇదే ఇంటర్వ్యూలో తన తండ్రికి సంబంధించిన మ్యాటర్ కూడా బయటపెట్టింది. మా డాడీ మంచివారు కాదు. చాలాసార్లు మా మమ్మీని కొట్టారు టార్చర్ చేసారు.అందుకే నేను ఆయన్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పాను.అంతే కాదు నువ్వు ఇంట్లో ఉంటే నేను ఉండనని చెప్పా.. దాంతో మా డాడీ వెళ్లిపోయారు. కానీ ఇప్పటివరకు కూడా మా డాడీని మిస్ అయిన ఫీలింగ్ నాలో కొంచెం కూడా లేదు. ఎందుకంటే మా మమ్మీ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: