సాధారణంగా టాలీవుడ్ లేదా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా స్టార్ హీరోయిన్లు సినిమాలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా, కొత్తగా ఎదుగుతున్న హీరోలతో లేదా మిడ్-రేంజ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేయడానికి వారు అంతగా ఒప్పుకోరు. ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో నడుస్తున్న సాంప్రదాయం. ఒక స్టార్ హీరోయిన్ ఒక హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకోవాలంటే, అతని మార్కెట్ విలువ, సినిమా కథ, డైరెక్టర్ క్రేజ్ అన్నీ కలిసి కుదిరినప్పుడు మాత్రమే ఆమోదం తెలుపుతారు. కానీ ఈ సాంప్రదాయాలను పక్కనబెట్టి, నవీన్ పోలిశెట్టి విషయంలో మాత్రం వేరేలా జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి అనే పేరు ఈ రోజుల్లో తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త కాదు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్, ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్స్ ఎంపికతో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అసాధారణం.


గతంలో ఆయన లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి పక్కన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి టాక్ అందుకొని హిట్‌గా నిలిచింది. అనుష్క పక్కన నవీన్ పోలిశెట్టి గ్లామరస్‌గా కనిపించకపోయినా, తన కామెడీ టైమింగ్, క్యూట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేశారు. అప్పట్లోనే ఇండస్ట్రీలో, “అనుష్క లాంటి టాప్ హీరోయిన్ ఒక మిడ్-రేంజ్ హీరోతో ఇంత బోల్డ్‌గా ఓపెన్‌గా సినిమా చేయడానికి ఒప్పుకోవడం చాలా అరుదు” అంటూ చర్చలు జరిగాయి.



ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి రిపీట్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ క్యూటీ క్వీన్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన కథా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతోందని, అది సమాజానికి ఉపయోగపడే విధంగా తెరకెక్కుతున్నదని టాక్ వినిపిస్తోంది. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఒక మిడ్-రేంజ్ హీరోతో ఇలాంటి స్టోరీ-ఓరియెంటెడ్ సినిమా చేయడం నిజంగా పెద్ద సర్ప్రైజ్ అని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. గతంలో అనుష్క-నవీన్ కాంబినేషన్‌పై ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు ఎలా రియాక్ట్ అయ్యారో, ఇప్పుడు కాజల్-నవీన్ కాంబినేషన్‌పైనా అదే స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇది నవీన్ పోలిశెట్టికి వచ్చిన గుర్తింపు, అతని ప్రతిభకు లభించిన గౌరవమే అని అభిమానులు అంటున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు కూడా నవీన్ పోలిశెట్టితో సినిమాలు చేయడానికి ముందుకు రావడం, అతని టాలెంట్‌కి ఇచ్చిన రిస్పెక్ట్ అని చెప్పొచ్చు.



ఈ సినిమాకి సంబంధించిన ఆఫిషియల్ అప్డేట్స్ రాబోయే రోజుల్లో బయటకు రానున్నాయి. కానీ ఈ వార్తల వల్లే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. "నవీన్ పోలిశెట్టికి నిజంగా లక్కి రోజులు వచ్చేశాయి. ఇప్పుడు అతని స్థాయి పెరిగింది. అందుకే కాజల్, అనుష్క లాంటి స్టార్ బ్యూటీలు ఆయనతో స్క్రీన్ షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు" అంటూ నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: