తెలుగు, తమిళ, మలయాళ సినిమా ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు షాలిని. చిన్ననాటి నుంచే వెండితెరపై మెరిసిన ఈ అమ్మాయి, ఆ తర్వాత హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసి, చివరికి స్టార్ హీరో భార్యగా స్థిరపడింది. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన షాలిని అసలు పేరు షాలిని బాబు. ఆమె తండ్రి బాబు – కేరళలోని కొల్లంకు చెందిన మలయాళీ ముస్లిం. తల్లి ఆలిస్. చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టిన షాలిని, “బేబీ షాలిని” గా మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది. 1980లలో స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా బిజీగా మారింది. తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకునే సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (1990). ఇందులో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి సరసన చిన్నారిగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.


పాఠశాల చదువుల కోసం కొంత విరామం తీసుకున్న షాలిని, తిరిగి 1997లో తమిళ సినిమా  ‘అనియతిప్రవు’ తో హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యి, షాలినికి రాత్రికి రాత్రే స్టార్ హోదా తెచ్చింది. ఆమె క్యూట్ లుక్స్, సహజమైన నటన, గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతలో ఐకాన్‌గా మారింది. తరువాత షాలిని తమిళంలో అనేక హిట్ సినిమాలు చేసింది. ఆమె కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ప్రేమలో పడింది. ఈ ప్రేమ తర్వాతే 2000 ఏప్రిల్ 24న హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అజిత్‌తో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అయితే ఆమె నటన ముద్ర వేసిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.



1999లో బాలీవుడ్‌లో కూడా ఆమె అదృష్టం పరీక్షించుకుంది. అజిత్ కుమార్‌తో కలిసి ‘రఖ్వాలా’ సినిమాలో నటించింది. అయితే ఎక్కువగా ఆమె ప్రాధాన్యత మలయాళం, తమిళ భాషల సినిమాలకే పరిమితమైంది. నటిగా కొద్దికాలం మాత్రమే ఉన్నప్పటికీ, షాలిని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన పాత్రలు, హీరోయిన్‌గా చేసిన ‘అనియతిప్రవు’ వంటి సినిమాలు ఆమెను సినీ చరిత్రలో నిలిపాయి. షాలిని – చిన్ననాటి బేబీ షాలిని నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చివరికి స్టార్ హీరో భార్యగా సంతోషంగా జీవనం కొనసాగిస్తోంది. సినీ రంగాన్ని వదిలినా, ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం నేటికీ తగ్గలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: