
ఈ సైట్ ద్వారా ఎటువంటి చెల్లింపు ధరలు లేకుండా ఉచితంగా సినిమాలు చూస్తున్నారు ప్రజలు . డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఈ సైట్ లో ఆప్షన్ ఉండడం విశేషం . ఇక రిలీజ్ అయిన అదికొద్ది క్షణాలలోనే ఈ సైట్లో దర్శనమిస్తున్నాయి సినిమాలు . దీంతో డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్లు వాపోతున్నారు . ఈ విధంగానే 300 కోట్ల బడ్జెట్ మూవీ ఒకటి ఇందులో దర్శనమిచ్చింది . ఆ సినిమా మరేదో కాదు మహావతార్ నరసింహ . ఈ మూవీ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందింది . ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక కథ కాదు అసాధారణమైన గ్రాఫిక్స్ మరియు అద్భుతమైన కథనాలతో ప్రేక్షకులను సరికొత్త రీతిలోకి తీసుకెళ్తుంది .
ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకులను మరియు విమర్శకులను ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు . ఇక కేవలం ఒక యానిమేషన్ సినిమాగా విడుదలై ఇది సాధించిన విజయం అంతా కాదనే చెప్పాలి . ఈ సినిమా సుమారుగా కోట్ల బడ్జెట్ తో రూపొందింది . తెలుగులో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ విడుదల చేశారు . విడుదల అయినప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది ఈ మూవీ . ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మార్కెట్ ను దాటి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది . ఇక ఈ సినిమా సాధించిన లాభాలు బడ్జెట్ తో పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉన్నాయి . ఈ విజయం భారతీయ యానిమేషన్ చరిత్రలకు ఒక కొత్త మార్గాన్ని చూపించండి అని చెప్పుకోవచ్చు . ఇక తాజాగా ఈ సినిమా ఐ బొమ్మలో ప్రత్యక్షమై సందడి చేస్తుంది .