గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరోయిన్ నటించిన విషయం మనకు తెలిసిందే. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం తమన్ "గేమ్ చెంజర్" సరైన స్టెప్స్ లేవు అని , అందుకే ఆ మూవీ లోని పాటలు జనాల్లోకి వెళ్లలేదు అని ఆయన కామెంట్స్ చేశాడు.

ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దానిపై చరణ్ అభిమానులు కూడా తమన్ పై ఫైర్ అయ్యారు. ఇకపోతే తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తమన్ , చరణ్ అభిమానులతో జరిగిన వివాదం గురించి క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తమన్ మాట్లాడుతూ  ... నేను గేమ్ చెంజర్ సినిమాలో చరణ్ మంచి డాన్స్ చేయలేదు అని అనలేదు. ఒక సినిమాలోని పాటలో ఏదైనా హుక్ స్టెప్ ఉన్నట్లయితే ఆ పాట విపరీతంగా జనాల్లోకి వెళుతుంది.

అలాంటి స్టెప్లు గేమ్ చేజర్ మూవీ లో లేవు అన్నాను. చరణ్ గొప్ప డాన్సర్. నాయక్ సినిమాలో లైలా ఓ లైలా సాంగ్ ఆయన డాన్స్ వల్లే సాంగ్ అంత పాపులర్ అయింది. చరణ్ లాంటి గొప్ప డాన్సర్ ఉన్నాడు. అతని వాడుకోలేదు అనేదే నా బాధ. అంతకన్నా ఏమీ లేదు. ఇక గేమ్ చేంజర్ సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డాను. దిల్ రాజు గారు ఆ సినిమా కోసం నాకు ఇచ్చిన డబ్బులను మొత్తం పాటల కోసమే ఖర్చు పెట్టాను. అంతలా కష్టపడ్డ సినిమాకు రిసల్ట్ మాత్రం ఆ స్థాయిలో రాలేదు. అదే నా బాధ అని తమన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: