కొంత కాలం క్రితం ఎంతో గ్రాండ్ గా ఆసియా కప్ ప్రారంభం అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఆసియా కప్ అంటే చాలు ఇండియా , పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. దానితో ఎప్పుడు ఇండియా , పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుందా అని ఇటు ఇండియా అభిమానులు ఇటు పాకిస్తాన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇక ఈ సారి ఆసియా కప్ టోర్నమెంట్ లో మొత్తంగా ఇండియా , పాకిస్తాన్ మూడు సార్లు తల పడ్డాయి. ఇండియా , పాకిస్తాన్ మొదటి మ్యాచ్ లో తలబడిన సందర్భంలో ఇండియా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సమయం లో పాకిస్తాన్ అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఇండియా , పాకిస్తాన్ తలబడిన సందర్భంలో కూడా భారత జట్టు గెలిచింది. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ అభిమానులు ఆ దేశ ఆటగాళ్లపై ఫైర్ అయ్యారు. ఇకపోతే నిన్న ఇండియా , పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీనితో ఈసారైనా పాకిస్తాన్ గెలుస్తుంది అనే ఉద్దేశంతో పాక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఈ సారి కూడా ఇండియా జట్టు పాకిస్తాన్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నిన్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ గా జరిగిన చివరకు మాత్రం ఇండియా గెలిచింది.

ఇక ఇండియా గెలవడంతో పాక్ అభిమానులు తీవ్రమైన స్థాయిలో వారి జట్టుపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ అభిమాని చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ అభిమాని పాకిస్తాన్ మొత్తం కలిసి వెళ్లిన ఇండియాపై అస్సలు గెలవలేం.  మనం ఇంకా ఎంతో కాలం ఏడవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లో సంతోషం ఎక్కడుంది. ఇది కూడా ఒక జట్టేనా. మనం ఇండియన్స్ చెప్పలకు సమానం కాదు. ఐ లవ్ యూ ఇండియా. మాకు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కరెక్ట్ అని ఓ అభిమాని ఫైర్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: