కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. అజిత్ కుమార్ సినిమాల్లో నటిస్తూనే రేసింగ్ లలో కూడా పాల్గొంటూ ఉంటాడు. ఆయనకు రేసింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆయన ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు రేసింగ్ లలో కూడా పాల్గొంటూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ కుమార్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన తన భార్య గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అజిత్ కుమార్ మాట్లాడుతూ ... నేను సినిమాల్లోనూ అలాగే రేసింగ్ పై కూడా టైం స్పెండ్ చేయడానికి ప్రధాన కారణం నా భార్య. నా భార్య నన్ను అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మాకు 2002 వ సంవత్సరం వివాహం అయింది. వివాహం అయిన దగ్గర నుండి నన్ను ఆమె ఎంతో బాగా అర్థం చేసుకుంటూ ఉంది.

నేను సినిమాల్లో మరియు రేసింగ్ లలో సమయాన్ని కేటాయించడానికి ఆమె కారణం. మాకు పెళ్లి అయిన కొంత కాలానికి పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమె బిజీ అయ్యింది. అయినా కూడా నా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఆమె లేకపోయి ఉండి ఉంటే నేను ఇటు సినిమాలలో , ఆటో రేసింగ్ రెండింటి పై సరైన సమయాన్ని కేటాయించే వాడిని కాదు అని అజిత్ కుమార్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. అజిత్ కుమార్ కొంత కాలం క్రితం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ak