
అయితే ఇప్పటివరకు ఈ చిత్రం గురించి కేవలం అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే వచ్చింది. కానీ తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేశారని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నట్లు వినిపిస్తోంది. పెద్ది సినిమా పూర్తి అయ్యాక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందట. ఫిబ్రవరి మొదటి వారంలోనే మొదటి షెడ్యూల్ ని షూట్ చేయబోతున్నట్లు వినిపించడంతో ఈ విషయం అభిమానులకు మరింత ఆనంద పడుతున్నారు.
RC -17 సినిమా వచ్చేయేడాది సంక్రాంతికి ఓపెనింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. గతంలో రామ్ చరణ్ ,సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇందులో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉండడమే కాకుండా అభిమానులు కూడా మెచ్చుకునేలా చూపించారు సుకుమార్. దీంతో ఇప్పుడు తదుపరి చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారని విషయంపై అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకులకు ముందుకు వచ్చిన బారి డిజాస్టర్ ని ఎదుర్కొన్నారు. దీంతో కథల ఎంపిక విషయంలో రామ్ చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.