
అయితే ఇచ్చిన హామీలను అమలు , కొన్ని సమస్యలను పరిష్కారం చేయలేని సిచువేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది నాయకులకు, అలాంటి ఇబ్బంది ఇప్పుడూ పవన్ కళ్యాణ్ కి ఏర్పడగా.. ఏకంగా అపోజిషన్ నేతలు మాట్లాడినట్లుగా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉప్పాడ టూర్ పొలిటికల్ పరంగా వెళ్లారు. అక్కడ మత్స్యకారుల సమస్యలను పరిష్కారం చేయడం చేయడం కోసం రంగంలోకి దిగారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న మత్స్యకారుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం చూపలేకపోతున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మత్స్యకారుల సమస్యలు ఒక సవాల్ గా మార్చిందనే చర్చ జరుగుతోంది. మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్ధలు సముద్రంలో కలపడంతో సముద్రంలోని నీరు కలుషితమై వేట చేయడానికి మత్స్యకారులు చాలా అవస్థలు పడుతున్నారని తెలుపుతున్నారు. ఇటీవల మత్స్యకారులు కూడా పెద్ద ఆందోళన చేశారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి , ఉప్పాడ లో బహిరంగ సభను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి
తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని రోజున ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఎవరో కొంతమంది లీడర్ల చేతులు కలిపి చేయి దులుపుపోవడానికి రాలేదని సమస్యను పరిష్కారం కోసం తనకు కొంత సమయం కావాలని తెలిపారు. ఈ ఉప్పాడలో మత్స్యకారుల సమస్య ఎన్నో ఏళ్ల నుంచి వస్తూనే ఉంది. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ సీఎంగా కీలకమైన బాధ్యతలు చేపట్టినప్పటికీ తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి సమస్యలు పట్టించుకోకపోతే ఎలా అనే విమర్శలు వినిపిస్తాయని అందుకే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి మరి వీటి మీద ఫోకస్ పెట్టారు. అలాగే మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలను సముద్రంలోకి కాకుండా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారని సముద్ర తీర ప్రాంత ప్రజల భద్రత కోసం ప్రొటెక్షన్ వాల్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ కు ఈ ఇష్యూ ఒక సవాల్గా మారింది. మరి ఏం చేస్తారన్నది చూడాలి.