
ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి క్రేజీ సంపాదించుకున్న ఈమె కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం వంటి భాషలలో నటించింది. కెరియర్ డల్ అవుతున్న సమయంలో 2014లో వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. చివరిసారిగా కామ్నా జఠ్మలానీ చంద్రిక సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పదేళ్లకు కిరణ్ అబ్బవరం నటిస్తున్న కే ర్యాంప్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించగా హీరోయిన్గా ముక్తి తరేజ్ నటిస్తోంది.
కామ్నా జఠ్మలానీ తొలి ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ హోదాను మిస్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా వరుస అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి మరి. అయితే అందం విషయంలో అప్పటికి ఇప్పటికీ అలానే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే సీనియర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వారిలో జెనీలియా జూనియర్ సినిమాలో నటించగా ఆకట్టుకోలేకపోయింది. అన్షు అంబానీ మజాకా సినిమా లో నటించిన సక్సెస్ కాలేదు. ఇక మరొక హీరోయిన్ లయ నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. సీనియర్ హీరోయిన్ నువ్వు నేను ఫేం అనిత సుహాసి నటించిన అయ్యో రామ చిత్రంలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు.
కామ్నా జఠ్మలానీ పరిస్థితి ఏంటో చూడాలి.