
వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు 'అలేఖ్య చిట్టి పికిల్స్' వివాదంతో పాపులర్ అయిన రమ్య మోక్ష. సోషల్ మీడియాలో గ్లామరస్ రీల్స్, స్టైలిష్ వీడియోలతో యూత్‌ను ఆకట్టుకున్న రమ్య, తన పచ్చళ్ల బిజినెస్ ద్వారా వచ్చిన వివాదంతో మరింత ఫేమస్ అయ్యింది. ఫిజికల్‌గా బలంగా, గొడవల్లో వెనక్కి తగ్గని స్వభావం ఉన్న ఈమె బిగ్ బాస్ హౌస్‌లో చాలామందికి గట్టి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చీ రావడంతోనే తన గోల్ గురించి మాట్లాడుతూ నాగార్జునతో ఆసక్తికరమైన సంభాషణ జరిపింది.
మరోవైపు, సోషల్ మీడియా రీల్స్ ద్వారా, కొన్ని రాజకీయ సంబంధిత వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన దివ్వెల మాధురి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తనపై ఉన్న నెగెటివిటీని పోగొట్టుకోవడానికి, తను ఎవరో అందరికీ తెలియజేయడానికే బిగ్ బాస్‌కు వచ్చానని మాధురి చెప్పుకొచ్చింది. హౌస్‌లో ఎవరూ ఎక్కువ కాలం నటించలేరని, కొన్నాళ్లు చేసినా తప్పక దొరికిపోతారని ఆమె చెప్పడం షోపై ఆమెకున్న అవగాహనను తెలియజేస్తోంది.
ఈ ఇద్దరు కాంట్రవర్సీ కంటెస్టెంట్ల ఎంట్రీ బిగ్ బాస్ షోకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని, రేటింగ్స్ విషయంలో ఈ సీజన్ అదరగొడుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాత కంటెస్టెంట్లు, కొత్త కంటెస్టెంట్ల మధ్య పోటీ, కాంట్రవర్సీలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త ఎంట్రీల ద్వారా బిగ్ బాస్ షో ఇకపై రేటింగ్స్‌ను ఎలా పెంచుకుంటుందో, ఇంట్లో ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి.