తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో నాగర్జున సినిమాల్లో హీరో పాత్రాల్లో నటించడం కంటే కూడా ఇతర పాత్రలలో నటించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలం లోనే నాగార్జున సినిమాల్లో కీలక పాత్రల్లో , విలన్ పాత్రలలో నటించాడు. నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

సినిమా విడుదల అయ్యి ఇప్పటికి చాలా కాలమే అవుతుంది. ఈ మూవీ తర్వాత నాగార్జున హీరో గా ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లేకపోతే నాగర్జున తన 100 వ సినిమా కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున తన 100 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు  తెలుస్తుంది. నాగర్జున 100 వ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే నాగర్జున , అనుష్క కాంబోలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి.

అందులో చాలా మూవీలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఆన్ స్క్రీన్ పై నాగార్జున , అనుష్క కెమిస్ట్రీ కి మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. దానితో నాగార్జున తన 100 వ సినిమా హీరోయిన్ విషయంలో ఎలాంటి నెగెటివిటీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నట్లు , అందులో భాగంగా  నాగార్జున తన 100 వ సినిమాలో అనుష్క ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు ఉన్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: