కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే 100 కోట్లతో ఎవరైనా సినిమా తీస్తున్నారు అంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు అంత బడ్జెట్ తో సినిమా చేయడం చాలా రిస్క్. ఏ కాస్త తేడా కొట్టిన పెద్ద మొత్తంలో నిర్మాతకు నష్టాలు వస్తాయి. ఆ తర్వాత ఆ నిర్మాత కోల్పోవడం కూడా ఎంతో కష్టం అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. ఇకపోతే ప్రస్తుతం 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు చాలానే వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికి కూడా 100 కోట్లతో రూపొందిన సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకుంటూ భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి.

ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ తాజాగా ఓ యాడ్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక యాడ్ కోసమే ఏకంగా 150 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇలా నిమిషాల నిడివితో ఉండే యాడ్ కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనే వార్త బయటకు రావడంతో చాలా మంది షాక్ అవుతారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాడ్ లో రణవీర్ సింగ్ , శ్రీ లీల ,  బాబి డియోల్ నటించారు. అట్లీ ఒక ప్రముఖ కంపెనీ కోసం రన్వీర్ సింగ్ , శ్రీ లీల , బాబి డియోల్ లతో ఈ యాడ్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ యాడ్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కేవలం నిమిషాల నిడివితో ఉండే యాడ్ కోసం 150 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అనే వార్త బయటకు రావడంతో చాలా మంది ఒక యాడ్ కోసం ఎంత ఖర్చు అవసరమా ..? ఇది మరీ టూ మచ్ అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అట్లీ , అల్లు అర్జున్ హీరో గా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క చిత్రీకరణ శర వేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: