
అదేమిటంటే కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ కు నామినెట్ చేయాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారని ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన జానపద శైలి, ఆధ్యాత్మిక భావనకి ప్రేక్షకులు సరికొత్త అనుభూతి చెందారని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి చేసిన నటన అద్భుతంగా ఉందని ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఇదే అన్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా రిషబ్ శెట్టి నటనలో ఆధ్యాత్మిక ఉత్సాహం, జానపద దేవత భావాన్ని చూపించిన తీరు ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే కాంతార చాప్టర్ 1 లో రిషబ్ నటన చూసి సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయం పై మద్దతు తెలుపుతున్నారు నేటిజన్స్. కాంతార వంటి ఆధ్యాత్మిక చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సిన సమయం వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తూ ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు. మరి ఈ విషయం పైన హోంబలే ఫిలిం సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంతార చాప్టర్ 1 లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితర నటీనటులు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గానే ఉంది.