కొండా సురేఖ పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు.కొండా సురేఖ ఓ ఎస్ డి సుమంత్ ని అరెస్టు చేయడం కోసం ఏకంగా పోలీసులు మంత్రి ఇంటి పైకి రావడంతో ఈ వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న ఒక మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కాంగ్రెస్ లోని మంత్రులు ఆమెకు మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సురేఖ ఇంటికి వెళ్లారు. రేపు మన పరిస్థితి కూడా అంతే కావచ్చు అని సురేఖ కి ఫోన్ చేసి మేము నీకు మద్దతుగా నిలుస్తాం అని మాట్లాడినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా కాంగ్రెస్ లోని ఓ కీలక మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మన దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్న వారిని అక్రమ కేసులు పెట్టి లోపల వేయిస్తున్నారు. 

కానీ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఎంతోమంది వసూల్ రాజాలు ఉన్నారు.వారిని కాపాడుతూ మన దగ్గర నమ్మకంగా పనిచేసే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఆయన దగ్గర ఉండే ప్రధాన అనుచరులు ఎంతోమందిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వారిని పట్టించుకోలేదు. నువ్వేమీ భయపడకు నీకు మేమున్నాం అంటూ ఆ కీలక మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు వ్యాల్యూ లేకుండా పోయిందని,వారు చెప్పిందే మనం వినాల్సి వస్తుందని, మనం ఎక్కువ మాట్లాడితే ఇలా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వాపోయారట.

ఒకవేళ ఇదే జరిగితే రేవంత్ రెడ్డి మంత్రివర్గం రెండుగా చీలిపోయి ఓవైపు రెడ్డి మరోవైపు బీసీ,ఎస్సీ, ఎస్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కలిపి ఆయనపై తిరుగుబాటు చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కల్పించుకొని ఈ గొడవలన్నీ సర్దుమణిగేలా చేస్తారా లేక మంత్రివర్గం రెండుగా చీలిపోయే వరకు చూసి తన పదవికి ముప్పు తెచ్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: