రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నీది అగర్వాల్ , మాళవిక మోహనన్ , రీద్ధి కుమార్ లు నటిస్తున్నారు . ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మూవీ తో పాటు ప్రభాస్ , హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకేక్క lబోయే స్పిరిట్ అనే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తూ ఇప్పటికే ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ మరో స్టార్ డైరెక్టర్ మూవీ కి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. సుకుమార్ మరికొన్ని రోజుల్లోనే రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఆ మూవీ పూర్తి కాగానే ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ప్రభాస్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కాంబో మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు. సుకుమార్ తన తదుపరి మూవీ ని చరణ్ తో చేయబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ "పెద్ది" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ పూర్తి కాగానే చరణ్ , సుకుమార్ కాంబో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: