టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన నటుడిగా చాలా కాలం క్రితమే కెరియర్ను మొదలు పెట్టాడు. ఎన్నో సంవత్సరాల పాటు ఈయన సినిమాలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగించాడు. ఈయన కెరియర్ డిజె టిల్లు మూవీ తో ఒక్క సారిగా మారిపోయింది. ఈ మూవీ మామూలు అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో సిద్దు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో యూత్ ఆడియన్స్ కు సిద్దు అత్యంత దగ్గర అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన టిల్లు స్క్వేర్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత ఈయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన జాక్ అనే మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

తాజాగా సిద్దు "తెలుసు కదా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రాశి కన్నా , శ్రీ నిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది. తాజాగా ఓ ఈవెంట్లో భాగంగా సిద్దు మాట్లాడుతూ  ... ఈ సినిమా ఆఫర్ నాకు రావడానికి ప్రధాన కారణం నటుడు నితిన్. ఆయన ఈ మూవీ   కథ విని ఆ కథ నాకే బాగా సూట్ అవుతుంది అని ఒక రోజు ఫోన్ చేసి మరీ నాకు చెప్పాడు. ఆ తర్వాత నేను ఈ సినిమా కథను విన్నాను. అది నాకు బాగా నచ్చింది. అందుకే సినిమా చేశాను. నితిన్ లేకపోయి ఉండుంటే నాకు ఈ సినిమా ఛాన్స్ వచ్చేది కాదు. నితిన్ కి థాంక్స్ అని సిద్దు జొన్నలగడ్డ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: