మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ మరియు భావోద్వేగపూరితమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా శ్రీలంకలో జరిగిన కీలక షెడ్యూల్‌ను టీమ్ విజయవంతంగా పూర్తిచేసింది. ఆ షెడ్యూల్‌లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటపై ఓ అందమైన రొమాంటిక్ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సాంగ్‌ను వచ్చే నవంబర్ 8న హైదరాబాద్‌లో జరగనున్న ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్‌లో విడుదల చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


ఇక ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగేలా రామ్ చరణ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. చరణ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో “ఏం ప్లాన్ చేస్తున్నారు?” అంటూ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా, సింగర్ మోహిత్ చౌహాన్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి రెహమాన్ సరదాగా స్పందిస్తూ “చికిరి చికిరి… చరణ్ గారు!” అంటూ కామెంట్ చేయడం మరింత ఫన్‌ను క్రియేట్ చేసింది. ఈ స్నేహపూర్వక చాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.



అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది!

దాదాపు ఇదే తరహా సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ ఇటీవల మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘SSMB29’ టీమ్ కూడా చేసింది. మహేష్ బాబు స్వయంగా రాజమౌళిని ట్యాగ్ చేస్తూ సరదాగా ప్రమోషన్ చేసిన ఆ పోస్ట్ అప్పట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. అదే విధంగా ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా అలానే చరణ్ – రెహమాన్ మధ్య స్నేహపూర్వక చాట్ ద్వారా ప్రచారం మొదలుపెట్టడంతో, కొంతమంది నెటిజన్లు “బుచ్చిబాబు రాజమౌళి ప్లాన్‌ని కాపీ కొట్టేశాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏదేమైనా, ఈ స్నేహపూర్వక సోషల్ మీడియా ఆటపాటల వల్ల ‘పెద్ది’ మూవీపై హైప్ మరింత పెరిగింది. రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు ఎమోషనల్ న్యారేషన్, చరణ్ రా అండ్ రస్టిక్ లుక్—అన్ని ఈ సినిమాకి బిగ్ ప్లస్ గా మారబోతున్నాయి.  2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ఈ సినిమా రిలీజ్ కానుంది.ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ ఫేజ్‌లోకి అడుగుపెట్టగా, ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు — “చరణ్ – రెహమాన్ కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ గ్యారంటీ!”



మరింత సమాచారం తెలుసుకోండి: