ఇదే సమయంలో వశిష్ఠ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రిపరేషన్స్ ప్రారంభించినట్టు సమాచారం. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, వశిష్ఠ తన తర్వాతి సినిమాకి హీరోగా మాస్ మహారాజా రవితేజని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేస్తోంది.ఇండస్ట్రీ టాక్ ప్రకారం, వశిష్ఠ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక మైండ్-బ్లోయింగ్ సోషియో-ఫాంటసీ కథను రెడీ చేశాడు. ఆ కథ విన్న రవితేజ సూపర్ ఇంప్రెస్ అయిపోయి, వెంటనే ఓకే చెప్పాడట. ఇందులో మాస్ యాక్షన్, హ్యూమర్, అలాగే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మిక్స్ అయి ఉంటాయని సమాచారం. ఈ సినిమాతో రవితేజ కెరీర్‌లో ఒక కొత్త పేజీ తెరుచుకోబోతోందని, బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్ వినిపిస్తోంది.
గతంలో రవితేజ చేసిన “దరువు” సినిమాలో కూడా ఫాంటసీ టచ్‌తో కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఆ తరహా ఫాంటసీ జానర్‌లో రవితేజ నటించడం, అదీ వశిష్ఠ లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌తో కలిసి అంటే అభిమానులకు ఇది ఒక ఫెస్టివల్ లాంటిదే.సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి దశలో ఉన్నాయని, త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ వివరాలు బయటకు రానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, టాప్ టెక్నికల్ టీమ్‌తో తెరకెక్కనుందట. మ్యూజిక్ డైరెక్టర్‌గా టాప్ మ్యూజీషియన్‌ని, హీరోయిన్‌గా కూడా పాపులర్ స్టార్‌ని తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి