సాధారణంగా దొరికేటువంటి కాయగూరలలో బ్రోకలీ కూడా ఒకటి. ఇది మన శరీరంలో అన్ని భాగాలకు మేలు చేసేటువంటి కూరగాయ. ఇందులో ఉండేటువంటి ఖనిజాలు, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు ఫైబర్ వంటివి మన శరీరానికి చాలా ఉపయోగాన్ని కలిగిస్తాయి. బ్రోకలీ తినడం వల్ల మన శరీరానికి మంచి బాక్టీరియా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపును శుభ్రపరిచి మలబద్ధక సమస్యను నివారిస్తుంది.


బ్రోకలీ తినడం వల్ల ఎముకలను బలోపేతం చేయడానికి అలాగే ఎముకలకు కావాల్సిన క్యాల్షియం, విటమిన్K వంటివి పుష్కలంగా లభిస్తాయి. మన శరీరంలో క్యాల్షియం లోపం ఉండే విషయాన్ని కూడా గ్రహించడానికి సహాయపడుతుంది.

బ్రోకలీ తరచూ తింటూ ఉండడంవల్ల గుండె ఆరోగ్యం పనితీరుకి బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండేటువంటి ఫైబర్ పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వులను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.


బ్రోకలీ తింటూ ఉండడం వల్ల మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో వచ్చేటువంటి మంటను కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రహస్తులకు ఈ బ్రోకలీ దివ్య ఔషధం వంటిది. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రక్తంలో కలిసిపోయి చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.


బ్రోకలీ లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అలాగే ఇందులో క్యాన్సర్ కణాలతో పోరాడేటువంటి యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉండడం వల్ల  అలాంటివి దరి చేరనివ్వకుండా చేస్తుంది.


బ్రోకలీలో ఉండేటువంటి కెరోటినాయిడ్స్ కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల కంటిచూపు సమస్యలు కూడా దరి చేరవు.

బ్రోకలీ తరచూ తింటూ ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. బ్రోకలీ లో  92 శాతం నీరు ఉంటుంది కనుక శరీరం డి హైడ్రేట్ కాకుండా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: