టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ వస్తారని ఈ మధ్య కాలంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎందుకు ఈవెంట్ క్యాన్సిల్ చేశారనే ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ రష్మికనే రానప్పుడు విజయ్ ఏం వస్తాడని అన్నారు.
బడ్జెట్ కోణంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను రిస్క్ అనే అనుకుంటానని ఆయన తెలిపారు. ప్రతి మూవీ ప్రొడ్యూసర్ కు రిస్క్ అని ఆయన పేర్కొన్నారు. వరుస విజయాలు అందుకున్న దర్శకులు, నిర్మాతలకు సైతం కొత్త సినిమా రిలీజ్ వేళ టెన్షన్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరైనోడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే ఆ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుందని పేర్కొన్నారు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక యాక్టింగ్ కు జాతీయ అవార్డు వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి అల్లు అరవింద్ స్పందిస్తూ నాకు ఓ స్థాయి ఉంది కనుక సమాధానం చెప్పడం లేదని అన్నారు. ప్రెస్ మీట్ కు హాజరు కాకపోవడం గురించి రష్మిక క్లారిటీ ఇచ్చారు. మరో మూవీ షూటింగ్ వల్ల తానూ రాలేకపోయానని ఆమె పేర్కొన్నారు.
ఈ సినిమా నేను నటించిన సోలో సినిమా అని ఆమె కామెంట్స్ చేశారు. ఈ సినిమా నాకెంతో స్పెషల్ అని ఇలాంటి సినిమాలకు ఆదరణ దక్కాలని రష్మిక చెప్పుకొచ్చారు. ఇంతమంది మూవీ స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఈ సినిమా ఎంత గొప్పదో అర్థమవుతుందని ఆమె వెల్లడించారు. రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఈ సినిమా అందరినీ ఆలోచింపజేసే మూవీ అని ఆమె కామెంట్స్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి