బాలీవుడ్లో సీనియర్ నటిగా పేరు సంపాదించిన మలైకా అరోరా గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం ఏదో ఒక విషయంలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 50 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ , ఫ్యాషన్, అందం పరంగా ఎప్పుడు హైలెట్గా నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో వివాహమై విడాకులు తీసుకున్నప్పటికీ ఈమెకు ఒక కొడుకు ఉన్న ఏదో ఒక ఎఫైర్స్ రూమర్స్ లో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మలైకా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.



ముఖ్యంగా తనకంటే 13 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో కూడా డేటింగ్ చేసింది. ఆ మధ్య వీరిద్దరూ విడిపోయారనే విధంగా కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా తన వ్యక్తిగత జీవితం, సంబంధాల గురించి ఒక ప్రశ్న ఎదురవ్వగా విభిన్నమైన సమాధానాన్ని తెలిపింది. ఎవరికైనా సరే తన జీవితాన్ని తాను ఇష్టానుసారం గడపడానికి హక్కు ఉంటుందని, మనకు నచ్చిన వ్యక్తితో శృంగారం చేయడంలో కూడా ఎలాంటి తప్పు లేదని తెలియజేసింది. అయితే ఈ పని చేయడానికి పెళ్లి కావాల్సిన అవసరం లేదంటూ వెల్లడించింది.

మనం ఎక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నాం అనేది ముఖ్యమంటూ వెల్లడించింది మలైకా అరోరా. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈమె వ్యక్తిగత స్వేచ్ఛగా చూస్తుండగా మరి కొంతమంది మాత్రం ఇలాంటి పబ్లిక్ గా చెప్పడం తప్పంటూ విమర్శిస్తున్నారు. మలైకా అరోరా నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తన గ్లామర్ ఫోటోలలోనే కాకుండా అప్పుడప్పుడు ఫిట్నెస్ కి సంబంధించిన విషయాలు, జిమ్ వర్క్ అవుట్ విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఈమధ్య సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు కానీ ఇలాంటి వ్యాఖ్యలతో మాత్రం నిరంతరం వార్తలలో నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: