నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. మొదటిగా వీరి కాంబో లో సింహ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో లెజెండ్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక కొంత కాలం క్రితం వీరి కాంబోలో అఖండ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం వీరి కాంబోలో అఖండ 2 అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించారు. ఇప్పటివరకు వీరి కాంబో లో రూపొందిన సింహ , లెజెండ్ , అఖండ మూడు సినిమాలలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక దాదాపు ఇదే ఫార్ములా ను టాలీవుడ్ మాస్ దర్శకులలో మరొకరు అయినటువంటి గోపీచంద్ మలినేని కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... గోపీచంద్ మలినేని ఇప్పటికే బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గోపీచంద్ మలినేని తన తదుపరి మూవీ ని బాలకృష్ణ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో కూడా బాలయ్య రెండు పాత్రలలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య , గోపీచంద్ కాంబోలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో తెరకెక్కబోయే రెండవ సినిమాపై కూడా ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: