హిట్ లేదా ప్లాప్ అనే మాటలతో పెద్దగా సంబంధం లేకుండా, తన సినిమాలు ఎప్పుడూ హైప్ క్రియేట్ చేసే డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన సినిమాలంటే అభిమానులకు ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. అందుకే ఆయన నుంచి ఓ సినిమా వస్తుందని తెలిసినా, ఆ సినిమా గురించి చిన్న అప్‌డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియా అంతా చర్చలతో నిండిపోతుంది.ఇటీవల ఆయన డైరెక్షన్‌లో వచ్చిన “కూలీ” సినిమా మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ సాలిడ్ వసూళ్లు రాబట్టింది. అంచనాలకు తగ్గ కంటెంట్ కాకపోయినా, లోకేష్ మాస్ ట్రీట్మెంట్ కారణంగా ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రిస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయన తర్వాత చేయబోయే సినిమా పట్ల ఇప్పుడు కోలీవుడ్‌లో మరింత ఆసక్తి పెరిగింది.


ఇంతలోనే ఒక క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ తదుపరి ప్రాజెక్ట్‌గా “ఖైదీ 2” తరువ్వత ఆయన లైన్‌లో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే దాని పట్ల ప్రేక్షకులలో ఉండే ఎక్సైట్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. అజిత్ అభిమానులు కూడా ఈ వార్త విని ఆనందంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా వారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అజిత్ సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారు. లోకేష్ మాస్, యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో సినిమాలు తీయడంలో దిట్ట. ఇక అజిత్ కూడా తన ప్రత్యేకమైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఈ ఇద్దరి కలయిక అంటే కోలీవుడ్ మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.



అంతేకాకుండా, ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే ఇది కేవలం సినిమా కాదు, ఒక బాక్సాఫీస్ తుఫాన్ అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కొన్ని స్క్రిప్ట్స్‌పై వర్క్ చేస్తున్నాడని సమాచారం. వాటిలో అజిత్ ప్రాజెక్ట్ ఒకటిగా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇలాంటి రూమర్స్ మరింత బలంగా వినిపిస్తుండడంతో అభిమానుల్లో కుతూహలం మరింతగా పెరిగింది.మరి ఈ వార్త నిజమై, లోకేష్ కనగరాజ్ – అజిత్ కుమార్ కాంబో ఫిక్స్ అయితే, అది కోలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో కూడా మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: