మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయి చిత్రమైన “పెద్ది” తో సినీప్రియుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నది “ఉప్పెన” వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బుచ్చి బాబు సానా. చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమాపై ఆసక్తి పీక్స్‌లో ఉన్న సమయంలో, మేకర్స్ నవంబర్ 7న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ “చికిరి చికిరి” ను విడుదల చేశారు. ఈ పాట రిలీజ్‌ అయిన కొద్దిసేపటిలోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. చరణ్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్‌, రెహమాన్ సంగీతం — అన్నీ కలిసిపడి ఈ సాంగ్‌ను విజువల్ ఫీస్ట్‌గా మార్చేశాయి.


“చికిరి చికిరి అంటూ సాగిన ఈ పాటలో ‘ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళం తా ఆడిందే తైతక్కా’ వంటి లిరిక్స్‌ను బాలాజీ తనదైన రీతిలో రాసారు. ఈ పదాలకు మోహిత్ చౌహాన్‌ ఉత్సాహభరితమైన స్వరాన్ని అందించగా, సూపర్‌స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రాణం పోశింది. ఇక జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు మాత్రం మాటలతో చెప్పలేనంత స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ సాంగ్‌లో చరణ్ వేసిన హుక్‌ స్టెప్ నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. అభిమానులు మాత్రమే కాదు, డ్యాన్సర్స్, రీల్స్ క్రియేటర్స్ కూడా “చికిరి చికిరి ఛాలెంజ్” పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ట్రెండ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారు. చరణ్ యొక్క బాడీ లాంగ్వేజ్‌, అటిట్యూడ్‌, ఎనర్జీ – అన్నీ మ్యూజిక్ బీట్‌లకు పర్ఫెక్ట్‌గా సింక్ అవుతూ, పాటను హైలైట్ చేశాయి.



ఇంకా ఈ సాంగ్‌లోని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఓ ఎత్తైన కొండప్రాంతంలో, గాలులు వేగంగా వీస్తున్న పరిస్థితుల్లో చరణ్ వేసిన స్టెప్పులు నిజంగా హై రిస్కీగా కనిపిస్తున్నాయి. చుట్టూ లోయలు, ఒకవైపు ఎండిపోయిన చెట్టు కొమ్మపై ఒక కాలు, మరోవైపు స్లోప్ ఉన్న బండరాయిపై మరో కాలు ఉంచి, అద్భుతమైన బ్యాలెన్స్‌తో చేసిన ఆ డ్యాన్స్ మూవ్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సీన్స్ థియేటర్‌లో వచ్చేసరికి ఆడియన్స్‌కు గూస్బంప్స్ రావడం ఖాయమని అనిపిస్తోంది. కేవలం “చికిరి చికిరి” పాటలోనే ఇంత స్టైల్‌, ఇంత ఎనర్జీ, ఇంత క్రేజ్ ఉంటే – ఇక “పెద్ది” ఫుల్‌ ఆల్బమ్‌లో ఎలాంటి మేజిక్ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే — “చికిరి చికిరి” తో చరణ్ ఫైర్ లాగానే దూసుకుపోతున్నాడు… “పెద్ది” సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లేశాడు!



మరింత సమాచారం తెలుసుకోండి: