తెలుగు సినీ పరిశ్రమ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకొని అనేక ఇతర భాష సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న నటీ మణులు ఎంతో మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే ఇతర భాష సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్న వారు కూడా కొంత మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో రకుల్ ప్రీత్ సింగ్ ,   రాశి ఖన్నా కూడా ఉంటారు.

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సినిమాల్లో నటించింది. ఈమె చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. రాశి కన్నా కూడా చాలా తక్కువ సమయం లోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోకపోయినా మంచి గుర్తింపును మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం తమిళ్ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ లిస్టు లోకి మరో ముద్దుగుమ్మ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులలో పూజా హెగ్డే ఒకరు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు కంటే కూడా తమిళ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అనేక తమిళ సినిమాలు ఉన్నాయి. ఈమెకు మరికొన్ని తమిళ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు తెలుగు ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: