మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కాంత అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఈ నెలలో విడుదల కాబోతోంది. ఇటీవలే కొత్త లోక అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో  రూ .300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ నటించగా డైరెక్టర్ డోమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల అక్రమంగా లగ్జరీకారులు కొనుగోలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు దుల్కర్ సల్మాన్ ఇంట్లో ఉండే అన్ని కార్లను కూడా తనకి చేయడం జరిగింది. 


కార్లకు సంబంధించి అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, రెండు కార్లకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. నకిలీ పత్రాలతో కార్లను కొనుగోలు చేసి చౌక ధరకే ఇతర దేశాల నుంచి అక్రమంగా వీటిని కొనుగోలు చేశారని వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ దగ్గర ఇప్పటికే 60 కి పైగా కార్లు ఉన్నాయట. ప్రముఖ అత్యుత్తమ కంపెనీ కారులతో పాటుగా , ఓల్డ్ కార్లు కూడా దుల్కర్ సల్మాన్ గ్యారేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దుల్కర్ సల్మా కొత్త ల్యాండ్ రోవర్ డిఫరెంట్ కార్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

 అక్టా -110  స్పెషల్ ఎడిషన్ కార్డుని కొనుగోలు చేశారట. ఈ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బో ఇంజన్ కలదు. కేవలం నాలుగు సెకండ్ల వ్యవధిలోనే 100 k. M. వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు మట్టి రోడ్డు పర్వతాల మార్గాలలో కూడా చాలా సులభంగానే ప్రయాణించగలదు. ఈ ఫీచర్ ఉండడం వల్లే దుల్కర్ సల్మాన్ ఈ కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ కొన్న ఈ కొత్త కారు ధర సుమారు రూ .3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు అందుకుంటున్నారు దుల్కర్ సల్మాన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: